కేంద్రమంత్రి బండికి రాష్ట్రమంత్రి పొన్నం బహిరంగ లేఖ

73చూసినవారు
కేంద్రమంత్రి బండికి రాష్ట్రమంత్రి పొన్నం బహిరంగ లేఖ
కేంద్రమంత్రి బండి సంజయ్ కు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సెషన్ లో తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, నెరవేర్చడంలో కేంద్రం నిబద్ధతగా వ్యవహరించాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బండి పాత్ర కీలకమని అందులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్