విద్యార్థులది గ్రేట్ అచీవ్ మెంట్: కలెక్టర్

53చూసినవారు
విద్యార్థులది గ్రేట్ అచీవ్ మెంట్: కలెక్టర్
ఇటీవల నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 483 మంది విద్యార్థులు ఉండగా 432 మంది పరీక్షకు హాజరయ్యారని. 51 మంది హాజరు కాలేదని చెప్పారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో 432 విద్యార్థుల్లో 418 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. జిల్లాలో 96. 76 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్