కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ భారతరత్న, మాజీ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన పట్ల విద్యార్థులకు ఉన్న ప్రేమాభిమానాలు తెలియజేస్తూ, ఉపాధ్యాయులు విద్యార్థులు సమాజ హితం కోసం తోడ్పడడంలో ముందు ఉండాలని తెలియజేశారు.