తెలంగాణలోని ప్రతి పల్లె ఆదర్శ గ్రామంగా నిలిచేలా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. కరీంనగర్లో సోమవారం ఆమె మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్ బిల్లుల అంశం సీఎం దృష్టిలో ఉందని త్వరలో సమస్య పరిష్కరిస్తామన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ ద్వారా గ్రామస్తులకు ఉపయోగపడే పనులు మాత్రమే చేయాలన్నారు.