ఇబ్బందులకు గురిచేస్తున్న చిగురుమామిడి తహశీల్దార్

54చూసినవారు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహశీల్దార్ తమను ఇబ్బందులు పెడుతున్నారని ఓ కుటుంబం కరీంనగర్ కలెక్టరేట్ ముందు శుక్రవారం నిరసన వ్యక్తం చేసింది. చిగురుమామిడికి చెందిన రాములు, మైసవ్వ పేరు మీద ఉన్న రెండు ఎకరాల 37 గుంటల వ్యవసాయ భూమిని తమ అవసరాల నిమిత్తం వేరొక వ్యక్తికి అమ్ముకున్నామని, ఆ భూమిని తహశీల్దార్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆరోపిస్తూ నిరసన చేశారు. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్