బస్ పాస్ ఛార్జీల పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలి

80చూసినవారు
విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కరీంనగర్లో AISF రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి మంగళవారం అన్నారు. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా పేద, మధ్యతరగతి, గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుకోవడానికి ఆర్టీసీ బస్సుల ద్వారా పట్టణాలకు వెళ్తున్నారని, ఈ ఛార్జీల పెంపు ద్వారా వారిపై మరింత భారం పడుతుందని, నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్