కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో నూతనంగా నియమితులైన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు బుదవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. పోలీసులు వినియోగించే వివిధ సాఫ్ట్ వేర్లు, అప్లికేషన్, సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ కొనసాగుతుందని చెప్పారు. కానిస్టేబుళ్లకు బేసిక్ ట్రైనింగ్తో పాటు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి శిక్షణ ఉపయోగపడుతుందని సీపీ పేర్కొన్నారు.