కరీంనగర్ నగరంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ యాత్ర శనివారం సాయంత్రం 6: 30 గంటలకు వైశ్య భవన్ గాంధీ రోడ్డు వద్ద ప్రారంభమై నగరంలోని ప్రధాన వీధుల గుండా హనుమాన్ విగ్రహం, సీతారాముల విగ్రహంతో యాత్ర కొనసాగింది. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హనుమాన్ శోభయాత్రకు పటిష్ఠ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు.