కరీంనగర్ గోదాం గడ్డ ప్రాంతంలో ఎండు గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు బుదవారం పట్టుకున్నారు. పృథ్వీరాజ్ 425 గ్రాముల ఎండు గంజాయిని విశాఖపట్నం నుంచి కొనుగోలు చేసి విక్రయానికి తీసుకెళ్తున్నాడు. ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ రాము, సిబ్బంది అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.