కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో బుధవారం శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో రజక సంఘ సభ్యులు బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. డప్పుల మధ్య ఊరంతా తిరిగి బోనాలను ఊరేగింపు చేశారు. నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి పంటలు బాగా పండాలని గ్రామస్తులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, రజకసంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.