కోరుట్లలో చిన్నారి హితీక్ష దారుణ హత్య

1చూసినవారు
కోరుట్లలో చిన్నారి హితీక్ష దారుణ హత్య
జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారం రాత్రి ఐదేళ్ల హితీక్ష అనే చిన్నారి దారుణ హత్యకు గురైంది. ఆదర్శనగర్‌కు చెందిన ఆకుల రాము-నవీన దంపతుల కూతురు హితీక్ష ఇంటి బయట ఆడుకుంటుండగా కనిపించకుండా పోయింది. తర్వాత పోలీసులు గాలించి, పొరుగింటి స్నానాల గదిలో ఆమెను గొంతు కోసి హత్యచేసిన స్థితిలో కనుగొన్నారు. అనుమానితుడు విజయ్ పరారీలో ఉన్నాడు.

సంబంధిత పోస్ట్