ఘనంగా సిరికొండలో కామ దహనం

80చూసినవారు
ఘనంగా సిరికొండలో కామ దహనం
కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో గురువారం ముందుగా కామునికి పూజలు చేసి కామ దహనం ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగ ముందు కాముడిని దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. పిల్లల కేరింతలు, పెద్దలు ఉత్సాహంగా కామ దహనం చేశారు. పండుగ వాతావరణం ఊరంతా సందడిగా మారింది. మనిషిలోని చెడు గుణాలను దహనం చేసి ప్రజలంతా సుఖసంతోషాలతో కలిసి మెలసి ఉండడమే కామ దహణానికి చిహ్నమని గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్