కథలాపూర్: ఘనంగా సుఖ్ దేవ్ తాపర్ జయంతి వేడుకలు

53చూసినవారు
కథలాపూర్: ఘనంగా సుఖ్ దేవ్ తాపర్ జయంతి వేడుకలు
స్వాతంత్ర సమరయోధులు సుఖ్ దేవ్ తాపర్ 118 వ జయంతిని కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో గురువారం  యువజన సంఘాలు మరియు బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సుఖ్ దేవ్ భగత్ సింగ్, రాజ్ గురులతో కలిసి బ్రిటీష్ సామ్రాజ్యంపై భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని కోరారు.

సంబంధిత పోస్ట్