జగిత్యాల జిల్లా కోరుట్లలో 5 ఏళ్ల హితీక్ష మృతిచెందిన ఘటన మిస్టరీగా మారింది. ప్రమాదవశాత్తు మృతి చెందిందా? లేక హత్య జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపులుల విన్యాసాలు చూడడానికి మిత్రులతో వెళ్లిన హితీక్ష, భయంతో బాత్రూంలో దాక్కొని, కాలుజారి నల్లాపై పడిపోవడంతో చనిపోయిన అనుమానాలు ఉన్నాయి. తండ్రి రాము గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్నారు.