జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో శనివారం ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, తెలంగాణ కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి లు విచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో కలిసి అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను అందజేశారు.