జగిత్యాల జిల్లా కోరుట్ల రవీంద్రరోడ్ కు చెందిన ఇర్యాల సత్యనారాయణ (49)పై గత నెల అదే కాలనీలో నివసించే గంగనర్సయ్య పాత కక్షలతో కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో గాయపడిన సత్యనారాయణ కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.