జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం చోటుచేసుకుంది. తల్లి మరణించటంతో కొడుకు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం.. టేకి సాయిలు గత కొంత కాలంగా కోరుట్లలో కూలీ పనులు చేస్తూ భార్య పిల్లలతో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో 2 నెలల కిందట తల్లి రాజవ్వ మృతిచెందటంతో మనస్థాపానికి గురైన సాయిలు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు.