మెట్‌పల్లి మండలంలోని కోణారావుపేట గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున అటవీ ప్రాంతంలో గత కొన్ని రోజుల నుండి పేకాట స్థావరం ఏర్పరచుకొని కొంతమంది పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా మెట్‌పల్లి సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై కిరణ్ కుమార్ సిబ్బందితో రెండు బృందాలుగా ఏర్పడి పేకాట ఆడుతున్న ప్రదేశాన్ని చుట్టుముట్టి పేకాట ఆడుతున్న 13 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.