జగిత్యాల జిల్లా కోరుట్ల గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. కోరుట్లలోని గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు మంగళవారం ఉదయం అల్పాహారం తిన్న తర్వాత 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. వీరిని కోరుట్ల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.