అక్రమంగా పైపులు తరలించే వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి

82చూసినవారు
అక్రమంగా పైపులు తరలించే వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి
శంకరపట్నం మండలం కన్నాపూర్ లోని కిష్కింద పల్లెలో చెరువు మత్తడి పైపులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని గ్రామస్తులు అడ్డుకున్నారు. పంట పొలాలకు పోచమ్మ గుడికి వెళ్లేందుకు వర్షాకాలంలో ఇబ్బందిగా ఉండడంతో ఈ పైపులను వేసి చెరువు నీళ్లు వెళ్లేలా చేసి ఈ దారిగుండా పొలాలకు వెళ్లేవారు. సదరు వ్యక్తి ఈ పైపులను తొలగించడంతో వర్షాకాలంలో మళ్లీ ఇబ్బందులు తప్పవని, అధికారులు అతనిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్