మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన గొడుగు భావన, మారవెని శరణ్య ఇద్దరు విద్యార్థులు శుక్రవారం విడుదల చేసిన త్రిపుల్ ఐటీ బాసర కు ఎన్నిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాణి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శనివారం హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా త్రిపుల్ ఐటీ బాసరలో విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకొని మంచి స్థానంలో ఉండాలని కోరారు.