విద్యుత్ ఘాతంతో మూగ జీవి మృతి

76చూసినవారు
శంకరపట్నం మండలం గద్దపాకలో విద్యుత్ ఘాతంతో మూగజీవి మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు జక్కుల రాజు మధ్యాహ్నం యధావిధిగా గేదెను వదిలిపెట్టి మేతకు తీసుకెళ్లాడు. విద్యుత్ తీగలు తెగి ఓ రైతు భూమిలో పడడంతో గేదే వైర్లకు తాకడంతో మృతి చెందింది. గేదె విలువ రూ. లక్ష ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని పాడి రైతు కుటుంబం తెలిపింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో గేదె మృతి చెందని పలువురు రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్