చెత్తను రోడ్లపై వేస్తే వారికి జరిమానాలు తప్పవని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం పెద్దపల్లి పట్టణంలోని ప్రగతినగర్ లో ఇనుప సామాను దుకాణ యజమానికి రోడ్డుపై చెత్త వేసినందుకు రూ. 20 వేల జరిమానా విధించారు. పెద్దపల్లి పట్టణ ప్రజలు మురికి కాలువలో, రోడ్లపై చెత్త, ప్లాస్టిక్ కవర్లు వేసినట్లయితే జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.