వీణవంక మండలం బొంతవెళ్లి గ్రామానికి చెందిన తాటికొండ రామస్వామి, అతని భార్య పుష్పలీల ఆసుపత్రిలో ఉన్న తమ బందువుకు గురువారం భోజనం తీసుకెళ్తుండగా, మార్గం మధ్యలో కాచాపూర్ గ్రామానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న కారు వారి బైక్ ను ఢీ కొట్టడంతో పుష్పలీల అక్కడికక్కడే మృతి చెందగా, రామస్వామికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కారుతో ఢీ కొన్న వ్యక్తి పరారు అయినట్లు సమాచారం. ఘటన స్థలికి ఎస్సై చేరుకొని వివరాలు సేకరించారు.