ఇల్లంతకుంట మండలం ఆరేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు రూ 5లక్షల సీసీ రోడ్ పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు గడ్డం కొండల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుడికందుల సురేందర్ రెడ్డి, చింతలపల్లి లచ్చిరెడ్డి, కుస పవన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటేష్, రవి రెడ్డి, తిరుపతి రెడ్డి, మోహన్ పాల్గొన్నారు.