ఓవైపు పెళ్లి మరోవైపు క్రికెట్ మ్యాచ్

59చూసినవారు
మామూలుగా ఇండియా-పాకిస్తాన్ మధ్య వన్డే మ్యాచ్ అంటేనే చాలా మంది ఆసక్తి గా చూస్తుంటారు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఫీవర్ ఓ పెళ్లి వేడుకలో కనిపించింది. మానకొండూరు మండలం వేగురుపల్లి లో ఆదివారం ఓ వివాహ వేడుకలో ఇండియా - పాకిస్తాన్ స్క్రీన్ పై వేశారు. స్క్రీన్ పై పెళ్లి లైవ్ కవరేజ్ తో పాటు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కూడా ప్లే చేశారు. వేడుకకు హాజరైన వారు పెళ్లితో పాటు మ్యాచ్ను కూడా చాలా ఆసక్తిగా చూశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్