తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో రోడ్లపైన ఆరబోసి అమ్ముకుంటున్న రైతుల వడ్లను సీపీఐ పార్టీ నాయకులు శనివారం సందర్శించారు. అనంతరం నాయకులు బోయిని తిరుపతి మాట్లాడుతూ.. మండలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు దళారులకు విక్రయించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వెంటనే గ్రామాల్లో కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి దళారుల నుంచి రైతులను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.