మానకొండూరు మండలం ఊటూరులో మానేరు రంగనాయక స్వామి జాతరలో సోమవారం రాత్రి బండ్లు తిప్పే కార్యక్రమాన్ని నిర్వహించారు. వెగురుపల్లి, నీరుకుల్ల గ్రామాల మధ్య మానేరు వాగు సమీపంలో రంగనాయకస్వామి జాతరలో భాగంగా గ్రామం నుంచి ఏనుగు రూపంలో ఉండే ఎలుకభామ బొమ్మతో బండ్లు నిర్వహించుట ఆనవాయితీగా కొనసాగుతోంది. అందులో భాగంగానే బండ్ల కార్యక్రమం నిర్వహించారు.