ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాలు, జాతర

59చూసినవారు
శంకరపట్నం మండలం కన్నాపూర్ ధర్మారంలో బుధవారం శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. జాతరలో భాగంగా మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో మహిళలు నెత్తిన బోనాలతో డప్పు చప్పుళ్ల శివసత్తుల నృత్యాలతో గుడి వరకుచేరి అమ్మవారికి బోనాలు సమర్పించారు. బుధవారం ఎల్లమ్మ పట్నాలు జాతర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి భక్తులు, గౌడ సంఘం నాయకులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్