గురువారం వెంగళ శ్రీనివాస్ తన ద్విచక్ర వాహనంపై కేశవపట్నం నుండి స్వగృహానికి వెళ్తున్నాడు. ఇప్పలపల్లి సమీపాన కెనాల్ పై కుక్క ఎదురుగా వచ్చి బైక్ కు తగలడంతో శ్రీనివాస్ బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఎడమ కాలు విరిగి రోడ్డుపై పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి, పైలట్ గోపికృష్ణ కరీంనగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.