శంకరపట్నం: బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

80చూసినవారు
శంకరపట్నం: బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
శంకరపట్నం మండలం చింతగుట్ట గ్రామంలో వ్యాపారవేత్త కరివేద సదాశివ రెడ్డి ప్రథమ సంవత్సర వర్ధంతి కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం తాడికల్ గ్రామంలో కొత్తిరెడ్డి సాంబశివ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, అనంతరం మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి సతీష్ కుమార్, రావి విజయలక్ష్మి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్