సిరిసిల్ల జిల్లా కందికట్కూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎస్సీ కాలనీ)లో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ నిర్మల, గాలిపల్లి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పావని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బద్దం రవీంద్ర రెడ్డి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.