తిమ్మాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ(కేజీబీవీ) పాఠశాలలో అనన్య అనే విద్యార్థి బుధవారం ప్రమాదవశాత్తు కింద పడి చెయ్యి విరిగింది. దీంతో పాఠశాల సిబ్బంది కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇంటికి పంపించారు.