తిమ్మాపూర్ మండలం అలుగునూర్ చౌరస్తా వద్ద టిప్పర్ ఢీకొని బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం తెలిపారు. అలుగునూర్కి చెందిన వేల్పుల లక్ష్మణ్ (55)ను టిప్పర్ ఢీకొనడంతో మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న తిమ్మాపూర్ పోలీసులు మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.