విధుల్లో కొనసాగించాలని కలెక్టర్ కు వినతి

83చూసినవారు
విధుల్లో కొనసాగించాలని కలెక్టర్ కు వినతి
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో కొన్నేళ్లుగా పని చేస్తున్న పార్ట్ టైం, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమను ముందస్తు సమాచారం లేకుండా విధుల నుండి తప్పించడం పట్ల బుధవారం జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్శకు వినతిపత్రం అందజేశారు. బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్