
గ్రాండ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ టైటిల్ విజేతగా గుకేశ్
క్రొయేషియాలో జరిగిన 'గ్రాండ్ చెస్ టోర్నమెంట్' ర్యాపిడ్ విభాగంలో భారత్కు చెందిన ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ టైటిల్ను గెలుచుకున్నాడు. తొమ్మిది రౌండ్లలో 14 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. చివరి రౌండ్లో వెస్లీ సోపై గెలిచిన గుకేశ్ మొత్తం 6 విజయాలు, 2 డ్రాలు, ఒక్క ఓటమితో బలమైన ప్రదర్శన చూపించాడు. 6వ రౌండ్లో మాగ్నస్ కార్ల్సన్పై గెలిచిన గుకేశ్ మరోసారి తన ప్రతిభను చాటాడు.