ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ ఆసుపత్రిలోని డయాగ్నస్టిక్ హబ్, ఆయుర్వేద హోమియో సెంటర్, ఆయుష్మాన్ భారత్ వెల్ నెస్ సెంటర్, మాతాశిశు ఆసుపత్రిలో ఉన్న డెంటల్ సెంటర్, కంటి విభాగం, గర్భిణీల వార్డు, ల్యాబ్, ఆరోగ్య మహిళా కౌంటర్, 2డి ఎకో రూం, వివిధ ఓపి రూమ్ లను పరిశీలించారు.