సమగ్ర శిక్ష ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దపల్లిలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. ఆయన వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం ఉన్నారు. అలాగే ఉద్యోగులకు పలువురు మద్దతు తెలిపారు.