రామగిరి: శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి: మంత్రి శ్రీధర్ బాబు

54చూసినవారు
రామగిరి: శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి: మంత్రి శ్రీధర్ బాబు
శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామ స్టేజి వద్ద మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి శ్రీధర్ బాబు పూలమాలవేసి నివాళులర్పించారు. రాష్ట్ర రాజకీయాల్లో, పేద ప్రజల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీపాదరావు అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్