
హనీమూన్ హత్య కేసు.. సోనమ్‌ను పట్టించిన మంగళసూత్రం, ఉంగరం
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తప్పిపోకముంందు రాజా రఘువంశీ (29), సోనమ్ (25) బస చేసిన హోటల్లో మంగళసూత్రం, ఉంగరం లభించాయని, ఇవే ఆ తర్వాత దర్యాప్తులో నిందితురాలిని పట్టించాయని పోలీసులు తెలిపారు. కొత్తగా పెళ్లయిన మహిళ గదిలోనే మంగళసూత్రాన్ని వదిలి వెళ్లడం తమకు అనుమానం కలిగించిందన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించారన్నారు.