పెద్దపల్లి: ఆలయాల్లో హనుమాన్ జయంతి సందడి

82చూసినవారు
పెద్దపల్లి: ఆలయాల్లో హనుమాన్ జయంతి సందడి
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం హనుమాన్ చిన్న జయంతోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పెద్దపల్లి పట్టణం రైల్వే స్టేషన్ రోడ్ లో గల హనుమాన్ ఆలయం, మినీ ట్యాంక్ బండ్ వద్ద గల హనుమాన్ ఆలయం, చీకురాయి రోడ్ హనుమాన్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. జయంతి ఉత్సవాలకు హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్