కమాన్ పూర్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆదివరాహ స్వామి సన్నిధిలో ఆదివారం శ్రీ మువ్వ గోపాల కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ విజయవాడ వారి సౌజన్యంతో నృత్యోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి చిన్నారులు వచ్చి కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. నృత్య ప్రదర్శన ఇచ్చిన ప్రతి చిన్నారికి అకాడమీ తరపున మెమోంటోతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు.