ముత్తారం: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

80చూసినవారు
ముత్తారం: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ముత్తారం మండల కేంద్రానికి చెందిన వెంకటేష్(31) కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కొద్దిరోజులుగా మద్యానికి బానిస అయ్యాడు. ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మనస్తాపానికి గురై శుక్రవారం మద్యం మత్తులో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్