ముత్తారం మండలం, గ్రామానికి చెందిన నరేష్(33) కి భార్యతో విడాకులు కావడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. మద్యానికి బానిస అయిన నరేష్ డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులను బూతులు తిడుతూ చిత్రహింసలు పెట్టేవాడు. గురువారం రాత్రి మద్యం తాగి వచ్చి తన తల్లితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె అతడిని నెట్టి పక్కనే ఉన్న రోకలిబండతో నరేష్ తలపై, నుదురు, ఛాతీపై కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు లక్ష్మి పై కేసు నమోదు చేసినట్లు సీఐ బి.రాజు తెలిపారు.