ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన చొప్పరి నది(35) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబం, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలో కూలీపని చేసుకుని జీవిస్తున్న నది గత కొంతకాలంగా మద్యానికి బానిసై శనివారం మద్యం మత్తులో పురుగులమందు తాగగా.. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.