పెద్దపల్లి: హార్వెస్టర్ ఢీకొని మహిళా కూలీ మృతి

73చూసినవారు
పెద్దపల్లి: హార్వెస్టర్ ఢీకొని మహిళా కూలీ మృతి
హార్వెస్టర్ ఢీకొని మహిళా కూలి మృతి చెందడంతో కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లిలో హార్వెస్టర్ ఢీకొనగా, మొట్లపల్లి గ్రామానికి చెందిన దాసరి కనకమ్మ మృతిచెందగా, రాగుల వసంత కాలు విరిగింది. కూలీ పనికి వెళ్లి తిరిగి వస్తుండగా, హార్వెస్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి ప్రమాదానికి కారణమైనట్లు స్థానికులు సోమవారం తెలిపారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

సంబంధిత పోస్ట్