ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధులను సిబ్బంది కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల సంఖ్య ఆధారంగా అవసరమైన సామాగ్రిని సిబ్బందికి అప్పగించాలన్నారు.