రామగిరి మండలం బేగంపేటలో పారిశుద్ధ్యం పడకేసింది. జీపీ కార్యాలయంలో ప్రత్యేక అధికారిని నియమించినప్పటికీ పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సైడ్ డ్రైనేజ్ చెత్తచెదారం పేరుకపోయి రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగిన కారణంగా దుర్వాసనతో పాటు మురుగు నీరు ముందుకు కదలడం లేదు. ఇప్పటికైనా ప్రత్యేక అధికారి స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు