రాజ్యాంగ స్పూర్తితో ప్రజా ప్రభుత్వ పాలన సాగిస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మంథనిలో పలు గ్రామాల రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో శంకుస్థాపన చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజు అభివృద్ధి పనులు శంకుస్థాపన సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానంతో పేదల సంక్షేమమే ప్రధాన అజెండాగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.