ముత్తారం: రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి

62చూసినవారు
ముత్తారం: రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి
ముత్తారం మండలంలోని విత్తన దుకాణాలలో మంగళవారం వ్యవసాయ, పోలీస్ శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విత్తన దుకాణాలలో విత్తన రిజిస్టర్లను, బిల్ బుక్ లను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలుంటాయని, విత్తనం కొనుగోలు చేసిన ప్రతి రైతుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు. మండల వ్యవసాయ అధికారి అనుష, ఎస్ఐ నరేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్